హసన్‌పర్తి మహిళ హత్య కేసులో బసవరాజ్ అరెస్ట్
హన్మకొండ, సెప్టెంబర్ 12 (చక్రవాణి న్యూస్) : హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన స్వప్న (40) అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బళ్లారి జిల్లా గుడుదూరు గ్రామానికి చెందిన కారు డ్రైవర్ బసవరాజ్‌తో స్వప్నకు పరిచయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.పెళ్లి చేసుకోవాలని స్వప్న కోరడంతో ఆమెను బళ్లారికి పిలిపించిన బసవరాజ్.. గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు తెలిపారు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను తగలబెట్టడంతో పాటు, స్వప్న మొబైల్ ఫోన్‌ను చెరువులో పడేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బసవరాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


No comments:
Post a Comment